పాపం..మహేష్ కు ఈ ఏడాది కలిసి రాలేదు ! | Filmibeat Telugu

2017-12-19 104

2017 is the totally disappointing year for Mahesh Babu and his fans. 'Spyder' movie released this year has not played well at the box office.

తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ స్టార్లలో ఒకరైన మహేష్ బాబుకు 2017 సంవత్సరం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదనే చెప్పొచ్చు. గతేడాది బ్రహ్మోత్సవం ప్లాప్ తర్వాత మహేష్ బాబు ప్రతిష్టాత్మకంగా చేసిన చిత్రం 'స్పైడర్'. ఈ చిత్రం ద్వారా మహేష్ బాబు తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే హిట్, ప్లాపుతో సంబంధం లేకుండా మహేష్ బాబు ఇమేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.
ఈ ఏడాది మహేష్ బాబుకు సంబంధించిన మరో రెండు సినిమాలు ప్రారంభం అయ్యాయి. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో ఒకటి కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'భరత్ అను నేను'. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం 2018 తొలి త్రైమాసికంలో విడుదల కానుంది. దీంతో పాటు వంశీ పైడిపల్లి చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది. దీంతో పాటు త్రివిక్రమ్, రాజమౌళి చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.